Mohan Babu: ఆటోబయోగ్రఫీ రాస్తాను అంటున్న మోహన్ బాబు

ఆటోబయోగ్రఫీ రాస్తాను అంటున్న మోహన్ బాబు
Mohan Babu: ఆటోబయోగ్రఫీ రాస్తాను అంటున్న మోహన్ బాబు
Mohan Babu: సీనియర్ నటుడు మోహన్ బాబు సునీల్ హీరోగా నటిస్తున్న "సన్ ఆఫ్ ఇండియా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు మోహన్ బాబు. అలీ పోసాని కృష్ణమురళి కంటే తానే యాక్టింగ్ బాగా చేస్తానని సునీల్ చెప్పినట్లుగా మోహన్ బాబు కామెంట్ చేశారు. ఇక తాజాగా మోహన్ బాబు ఇప్పుడు తన ఆటోబయోగ్రఫీ రాయబోతున్నట్లుగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన జీవితంలో తాను ఇప్పటి దాకా ఎదుర్కొన్న అన్ని పరిస్థితులను తన ఆటోబయోగ్రఫీ లో రాస్తానని మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు.
ఇక తన ఆటోబయోగ్రఫీ లో తను కేవలం నిజం మాత్రమే రాస్తానని అన్నారు. మోహన్ బాబు ఇంతకుముందు కూడా ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటిదాకా తన సినిమాలలో ఉన్న తన ఫేవరెట్ డైలాగులను ఆ పుస్తకంలో రాశారు. ఇక ఈ మధ్యనే రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పిన మోహన్ బాబు ఆటోబయోగ్రఫీ రాస్తాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక మోహన్ బాబు ఆటో బయోగ్రఫీ ఎలా ఉండబోతుంది, అందులో ఏ ఏ విషయాలు ప్రేక్షకులతో పంచబోతున్నారు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMTCM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
12 Aug 2022 6:52 AM GMT