Mohan Babu Emotional: కృష్ణ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్‌బాబు

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహాన్ని కాసేపట్లో గచ్చిబౌలీ స్టేడియానికి తరలించనున్నారు.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 5:14 PM IST
Mohan Babu Pays Tribute to Super Star Krishna
X

Mohan Babu Emotional: కృష్ణ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్‌బాబు

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహాన్ని కాసేపట్లో గచ్చిబౌలీ స్టేడియానికి తరలించనున్నారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం గచ్చీబౌలీ స్టేడియంలో కృష్ణ పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

మరోవైపు కృష్ణ పార్థీవదేహానికి మోహన్‌బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. ఎన్నో సినిమాల్లో కృష్ణతో కలిసి నటించిన మోహన్‌బాబు.. ఆయన భౌతికకాయాన్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి, 'సోదరా.. సోదరా' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే మహేశ్‌బాబును హత్తుకుని ఓదార్చారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story