Shaakuntalam: సమంతా మూవీలో 'కలెక్షన్ కింగ్'

Shaakuntalam: సృజనాత్మక దర్శకుడు గుణశేఖర్, సమంత అక్కినేని తో తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'.

Venkata Chari
Published on: 16 March 2021 5:56 PM IST
Mohan Babu on board for Samantha Shaakuntalam Movie
X

శాకుంతల సినిమా పోస్టర్, మోహన్ బాబు (ఫొటో హన్స్ ఇండియా)

Shaakuntalam: సృజనాత్మక దర్శకుడు గుణశేఖర్, సమంత అక్కినేని తో తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. ఈ చిత్రం మహాభారతంలోని ఆది పర్వం నుంచి శకుంతల, దుష్యంత్ ల ప్రేమ కథను ప్రేరణగా తీసుకొని నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సౌత్ స్టార్ సమంత ఈ చిత్రంలో శకుంతల పాత్రను పోషిస్తుండగా, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించబోతున్నారు.

సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో దుర్వాస మహర్షి పాత్రకు మోహన్ బాబు ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుర్వాస మహర్షి మహాభారత పురాణంలోని ప్రసిద్ధ పాత్ర. అతనికి కోపం ఎక్కువగా ఉంటుంది. దీంతో అతను ప్రజలను వెంటనే శపిస్తాడు. ఆ వెంటనే ప్రశాంతంగా మారిన తర్వాత శాపం నుంచి ఎలా బయటపడతాడో కూడా వివరిస్తాడు. ఒక రోజు, తన భర్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటుంది శకుంతల. దుర్వాస ముని రాకను కూడా పట్టించుకోక పోవడంతో.. ఆయన శకుంతలను నీ భర్త నిన్ను మరచిపోతాడని శపిస్తాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోహన్ బాబుకు దుర్వాస మహర్షి మాదిరిగానే కోపంతో ఉంటాడు. అందుకే ఆ పాత్రను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోహన్ బాబు పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story