logo

మణిరత్నం దర్శకత్వంలో మోహన్ బాబు

మణిరత్నం దర్శకత్వంలో మోహన్ బాబు
Highlights

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ మధ్యనే 'మహానటి' సినిమాలో ఎస్వీఆర్ పాత్ర పోషించారు. తాజాగా మోహన్ బాబు...

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ మధ్యనే 'మహానటి' సినిమాలో ఎస్వీఆర్ పాత్ర పోషించారు. తాజాగా మోహన్ బాబు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే మణి రత్నం మోహన్ బాబును సంప్రదించారట. మోహన్ బాబు ఓకే అన్నారు కానీ ఇంకా అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రకు చాలానే ప్రాధాన్యత ఉండవచ్చు.

ఇటీవలే 'నవాబ్' సినిమాలో లాగా, మళ్ళీ అలాంటి అద్భుతమైన పాత్రల తో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. నిజానికి గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న మల్టీస్టారర్ ఇది. ఇప్పటికే పలువురు స్టార్లను సంప్రదించినా చాలా సార్లు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అప్పట్లో మహేష్, విజయ్ వంటి స్టార్లతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అది కుదరక విక్రమ్, విజయ్ సేతుపతి, జయం రవి లాంటి స్టార్లను ఫైనల్ చేసుకుని మిగతా పాత్రల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబును కూడా ఎంపిక చేసారు. ఆయన స్టామినాకు తగ్గట్టుగా నటించడానికి పూర్తి ఆస్కారం ఉన్న పాత్ర ఇది అని చెప్పుకోవచ్చు.


లైవ్ టీవి


Share it
Top