Tollywood: చిరు,మోహన్‌బాబు స్పెషల్‌ టూర్‌..ఈర్ష్యగా ఉందన్న మంచు లక్ష్మీ

Tollywood: మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు మైత్రి అందరికి తెలిసిందే.

Samba Siva Rao
Published on: 15 March 2021 12:41 PM IST
Mohan Babu Chiru Trip
X

మోహన్ బాబు, చిరు ట్రిప్

Tollywood: మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు మైత్రి అందరికి తెలిసిందే. ఆచార్య షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్న చిరు ఇటీవలే కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు మోహన్‌బాబును వెంటేసుకుని స్పెషల్‌ టూర్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని మోహన్ బాబు కూతురు మంచు లక్ష‌్మీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. చిరు, మోహన్ బాబు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.

ఈ సందర్భంగా.. "ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంతరచ్చ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి అంకుల్‌, నాన్నను ఒప్పించి మరీ తీసుకెళ్లాడు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగానే ఉంది. కానీ మీ ఇద్దరికి సమయం దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది. త్వరలోనే మేము కూడా మీతో పాటు జాయిన్‌ అవుతాము" అని ట్వీట్‌ చేసింది.

చిరంజీవి, మోహన్ బాబు వారి వారి సినిమాలతో బీజీగా ఉన్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆచార్య' చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లగా నటించారు. ఈ చిత్రం సమ్మర్‌లో మే 13న రిలీజ్‌ కానుంది. మరోవైపు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో 'సన్నాఫ్‌ ఇండియా'లో నటిస్తున్నాడు. దేశభక్తి ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా బాణీలు సమకూర్చారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story