నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం

Mohan Babu: సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 17 Nov 2021 7:55 PM IST
Mohan Babu Brother Rangaswamy Naidu Passes Away
X

నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం

Mohan Babu: సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) కన్నుమూశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. గురువారం ఉదయం తిరుపతి గోవింద ధామం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story