MM Keeravani: రాజమౌళి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయం చెప్పిన కీరవాణి

MM Keeravani: ఆ ఒక్క సినిమాలోనే అందరూ డామినేట్ చేస్తారు అంటున్న కీరవాణి

admin1
Published on: 10 Dec 2021 2:04 PM IST
MM Keeravani Says that Everyone Dominates in the Movie Chatrapathi | Tollywood News
X

ఆ ఒక్క సినిమాలోనే అందరూ డామినేట్ చేస్తారు అంటున్న కీరవాణి (ఫైల్-ఫోటో)

MM Keeravani: దాదాపు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు సాంకేతిక బృందం ఒకటే ఉంటుంది. ఎప్పుడో అక్కడక్కడా కొన్ని సినిమాలలో మాత్రం కొందరు మారుతూ ఉంటారు కానీ దాదాపు రాజమౌళి బృందం తను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలోనూ ఉంటారు.

ఇక దాదాపు రాజమౌళి సినిమాలలో సినిమాలకు సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. తాజాగా రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుతూ కీరవాణి కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశారు కీరవాణి.

"రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే హైలైట్ అవుతుండేది, స్టూడెంట్ నెంబర్ వన్ లో మ్యూజిక్, సింహాద్రి లో కథ, సై లో దర్శకత్వం డామినేట్ చేస్తాయి. కానీ చత్రపతి సినిమా లో మాత్రం అందరూ ఒకే విధంగా గా కష్టపడ్డారు ఒకేలా డామినేట్ చేశారు.

మళ్లీ విక్రమార్కుడు సినిమాలో మాత్రం రవితేజ మిగతా అన్నిటినీ డామినేట్ చేశారు," అని చెప్పుకొచ్చారు కీరవాణి. మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" కి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story