జబర్దస్త్ నుంచి రోజా అవుట్ ? కొత్త జడ్జ్ ఎవరంటే .!

జబర్దస్త్ నుంచి రోజా అవుట్ ? కొత్త జడ్జ్ ఎవరంటే .!
x
Highlights

సినిమాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీరోల్ పోషిస్తున్నారు . వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె బుల్లితెరపై జబర్దస్త్ షో...

సినిమాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీరోల్ పోషిస్తున్నారు . వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు . అయితే రోజా ప్రస్తుతం ఇక ఈ షోలో కనిపించరు అన్న వార్త గత కొద్దిరోజుల నుండి నడుస్తుంది . ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారంలో ఉంది . జగన్ ఆమెకి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ పదవిని కట్టబెట్టారు . దీనితో ఇక పూర్తి భాద్యతలు తనపైన ఉంటాయి కనుక రోజా జబర్దస్త్ షో నుండి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి . ఈ నేపధ్యంలో వచ్చే ఎపిసోడ్ నుండి ఆమె తప్పుకున్నారు . దీనికి సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేసింది . ఇందులో నాగబాబు పక్కన రోజా స్థానంలో డాన్స్ మాస్టర్ శేఖర్ కనిపించనున్నారు . మరి ఇది కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కి మాత్రమేనా లేకా మొత్తం జబర్దస్త్ కా అన్నది తెలియాల్సి ఉంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories