Jabardasth Team in Tirumala: "జబర్దస్త్"గా తిరుమల దర్శనం

బుల్లితెరలో మల్లెమాల నిర్వహిస్తున్న జబర్దస్త్ కామెడీ షోకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే.

Sandeep Reddy
Updated on: 2 July 2021 5:11 PM IST
MLA Roja and Jabardasth Sudigali Sudheer Team Visited in Tirumala Temple Today 02 07 2021
X

తిరుమలలో జబర్దస్త్ టీం(ఇంస్టాగ్రామ్ ఫోటో)

Jabardasth Team in Tirumala: బుల్లితెరలో మల్లెమాల నిర్వహిస్తున్న జబర్దస్త్ కామెడీ షోకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. కామెడీ తో పాటు టీ ఆర్ పీ రేటింగ్ లోనూ జబర్దస్త్ దూసుకుపోతుంది అందుకేనేమో బుల్లితెర ప్రేక్షకుల కోసం ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షో ని కూడా మొదలుపెట్టారు. చిత్రసీమకి ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన మల్లెమాల జబర్దస్త్ టీంలో పలువురు కమెడియన్స్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు, రాబోతున్నారు. అందులో ముఖ్యంగా సుడిగాలి సుదీర్, తన వైవిధ్యమైన గెటప్ లతో బుల్లితెర కమల్ హసన్ గా పేరొందిన గెటప్ శ్రీను హీరోలుగా తమ నూతన చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా సుడిగాలి సుధీర్ టీం తమ కుటుంబ సభ్యులు నగరి ఎంఎల్ఏ రోజాతో కలిసి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక సుడిగాలి సుధీర్ "గాలోడు" చిత్రంతో, గెటప్ శ్రీను "రాజు యాదవ్" చిత్రాల షూటింగ్ లతో పాటు ఇతర కామెడీ షోలతో బిజీగా గడుపుతున్నా కాస్త సమయం దొరకటంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రత్యక్షమయ్యారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story