ఘనంగా ఎమ్మెల్యే రోజా బర్త్ డే వేడుకలు!

ఘనంగా ఎమ్మెల్యే రోజా బర్త్ డే వేడుకలు!
x
Highlights

ఈ సందర్బంగా ఆమెకి అభిమానులు, పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గత రాత్రి త‌న కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు రోజా

అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు రోజా.. నేడు రోజా 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆమెకి అభిమానులు, పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గత రాత్రి త‌న కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు రోజా. దీనికి సంబంధించిన ఫొటోల‌ను రోజా సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

ఇక ఇదిలా ఉంటే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. రోజా 1972 వ సంవత్సరం నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో జన్మించారు. ఇక 'ప్రేమ తపస్సు'సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది రోజా.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రీ, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య మొదలుగు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రోజా.

తమిళ్, తెలుగు బాషలలో సీనియ‌ర్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించింది రోజా.. ఇక ఆ తరవాత తమిళ్ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రోజా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న రోజా పలు షో లకి మాత్రం జ‌డ్జిగా వ్యవహరిస్తూ వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories