Mission Impossible: The Final Reckoning: దుమ్మురేపుతున్న టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ ట్రైలర్

Mission Impossible: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో చివరిదైన ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ మొదటి ట్రైలర్‌ను పారామౌంట్ పిక్చర్స్ రిలీజ్ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 12 Nov 2024 10:21 AM IST
Mission Impossible The Final Reckoning Teaser is out
X

Mission Impossible: The Final Reckoning: దుమ్మురేపుతున్న టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ ట్రైలర్

Mission Impossible: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో చివరిదైన ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ మొదటి ట్రైలర్‌ను పారామౌంట్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన పది గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిందీ టీజర్. ఐఎంఎఫ్ ఏజెంట్‌ ఎథాన్ హంట్‌గా టామ్ క్రూజర్ ఈ ట్రైలర్‌లో దుమ్మురేపాడు. మిషన్ ఇంపాజిబుల్ మొదటి భాగం 1996లో వచ్చింది. 30 ఏళ్ళు గడిచినా టామ్ క్రూజ్ స్క్రీన్ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఎంఐ సీక్వెల్స్‌కు ముగింపుగా వస్తున్న ది ఫైనల్ రెకనింగ్ చిత్రంలో హీరో క్రూజ్ ఏఐ విలన్‌ ఎంటిటీతో పోరాటం చేస్తారు. 2022లో వచ్చిన డెడ్ రెకనింగ్ ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి ఈ ఎనిమిదో పార్ట్ మొదలవుతుంది. రెండు నిమిషాల లాంగ్ టీజర్లో టామ్ క్రూజ్ సాహసాలు సినిమా ప్రియులను విస్మయపరిచేలా ఉన్నాయి. 62 ఏళ్ళ క్రూజ్ విమానాన్ని చేజ్ చేస్తున్న సన్నివేశమైతే మైండ్ బ్లోయింగ్ గా ఉందని ఎంఐ సిరీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. టన్నెల్‌లో భారీ పేలుడు, కత్తి యుద్ధాలు ఈ చిత్రంలో హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.

టామ్ క్రూజ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుందని నిర్మాణ సంస్థ పారామౌంట్ చెబుతోంది. మనం ఎంచుకునే వాటి కలయికే మన జీవితం అంటూ క్రూజ్ ఈ ట్రైలర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. క్రిస్టఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 మే 23న విడుదలవుతుంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story