Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి...

Miscreants Pelted Stones at Singer Manglis Car
x

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి... 

Highlights

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి జరిగింది.

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ఆమె తిరిగి వెళ్తుండగా ఆమె కారు పై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజకుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంగ్లీతో పలువురు సింగర్స్ పాల్గొని పాటలు పాడారు. ఇక ఈ ప్రోగ్రామ్ అనంతరం మంగ్లీని చూసేందుకు చాలా మంది యువకులు మేకప్ టెంట్ లోకి దూసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో ఆ యువకులు మంగ్లీ కారు వెళ్తుండగా ఆమె కారుకు ఎదురెళ్లారు. అయితే మంగ్లీ స్వయంగా పోలీసులను అడ్డంపెట్టి తమను కలవకుండా చేసిందని కోపంతో వారేమైనా రాళ్లదాడి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. అయితే ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరారు. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె మీద కన్నడిగులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. తెలుగు నుంచి కన్నడ సినీ పరిశ్రమకు వచ్చి రెండేళ్లు దాటుతోందని ఇంకా కన్నడ అర్థం కావడం లేదా? ఇలాంటి వారికి ఎందుకు కనడ సినీ పరిశ్రమ అవకాశాలు ఇస్తోందని అంటూ వారంతా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అయితే ఈ కారణం వలన ఏమైనా ఆమె మీద దాడి జరిగిందా? అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories