మీర్జాపూర్ లో మున్నాభాయ్ రీఎంట్రీ...సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ నేటి నుంచి స్ట్రీమింగ్..!

Mirzapur 3 Bonus Episode Date Out Now
x

మీర్జాపూర్ లో మున్నాభాయ్ రీఎంట్రీ...సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ నేటి నుంచి స్ట్రీమింగ్..!

Highlights

తెలుగులో కూడా మీర్జాపూర్ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటివరకు మూడు సీజన్లలో ప్రసారం అయింది. ఈ మూడు సీజన్లో కూడా సూపర్ హిట్ అయ్యాయి.

Mirzapur OTT: ఓటిటి చరిత్రలో అత్యంత సక్సెస్ చూసిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే మీర్జాపూర్ అని చెప్పవచ్చు. పాన్ ఇండియాలో ఈ వెబ్ సిరీస్ కు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ తెరకెక్కించారు. తెలుగులో కూడా మీర్జాపూర్ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటివరకు మూడు సీజన్లలో ప్రసారం అయింది. ఈ మూడు సీజన్లో కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి ఈ మీర్జాపూర్ సిరీస్ లో.. మూడవ సీజన్లో మున్నాభాయ్ క్యారెక్టర్ కనిపించలేదు.

దీంతో మూడో సీజన్ అనుకున్నంత మజా ప్రేక్షకులకు లభించలేదు. ఎందుకంటే రెండవ సీజన్లోనే మున్నాభాయ్ చివరి ఎపిసోడ్లో మరణించినట్లు చూపించారు. కానీ మూడో సీజన్లో ఎన్ని ట్విస్టులు ఇచ్చిన మున్నాభాయ్ లేని లోటు కారణంగా అనుకున్నంతగా కథ రక్తి కట్టలేదు. దీంతో ప్రస్తుతం మేకర్స్ మీర్జాపూర్ సీజన్ 3 ఒక బోనస్ ఎపిసోడ్ ను ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బోనస్ ఎపిసోడ్ అమెజాన్ ప్లాట్ ఫారంలో అందుబాటులో ఉంటుంది. ఈ బోనస్ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది.

ఇందులో మనం ఏది సరిగ్గా చేయము చేశాక ఆలోచిస్తాం అంటూ... మున్నా క్యారెక్టర్ తన ఇంట్రడక్షన్ ఇస్తూ కనిపిస్తాడు. దీన్నిబట్టి సీజన్ ఫోర్ లో మున్నాభాయ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే మీర్జాపూర్ ఫ్యాన్స్ సీజన్ ఫోర్ లో మున్నాభాయ్ వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో థియరీలు చెప్తున్నారు. అయితే సీజన్ 2 లో చనిపోయిన మున్నాభాయ్ సీజన్ ఫోర్ లో ఎలా వస్తాడా ప్రస్తుతం ఈ బోనస్ ఎపిసోడ్లో మున్నాభాయ్ ఎంట్రీ ఎలా ఉంటుంది. లాజిక్ ఏంటి అనే విషయాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories