Perni Nani: దుర్గమ్మ జోలికి వెళ్లినందుకే..బాబుకు మనశ్శాంతి లేదు

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.

Samba Siva Rao
Updated on: 7 March 2021 4:54 PM IST
Perni Nani Ccomments on Chandrababu
X

పెర్నీ నాని ఫైల్ ఫోటో(ThehansIndia)

Perni Nani:టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కేవలం రెండు ఎవరాలతో మొదలైన చంద్రబాబు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. దేశంలో ఏ పాల వ్యాపారి ఇంత ఆస్తి సంపాదించలేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచి హెరిటేజ్ లాభాలుగా లెక్కలు చెప్పారని ఆరోపించారు. హెరిటేజ్ మొత్తం పాపాల పుట్ట అన్న పేర్ని నాని, అక్కడ వచ్చేది పాల వాసన కాదు.. పాపాల కంపు అని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్న కోపంతో చంద్రబాబు అక్కసు తీర్చుకుంటున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. హెరిటేజ్‌లో చంద్రబాబు దోచుకున్న సోమ్ముదాచరని, హెరిటేజ్‌ అంతా పాపాలపుట్ట అనిచ ఆయన విమర్శించారు. అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడను సర్వనాశనం చేశారని మంత్రి ఆరోపించారు. భూములు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు.

దుర్గమ్మవారి జోలికి వెళ్లినందుకే బాబుకు మనశ్శాంతి లేకుండా పోయిందని మంత్రి పేర్నినాని ఆరోపించారు. కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి. ఇప్పటికైనా బాబు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉండి కనీసం ఒక వంతెన నిర్మించలేదని, నిరుద్యోగులకు మోసం చేశారని మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story