Akhanda: ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోద్దంట!

Mind-blowing interval scene in Akhanda
x

నందమూరి బాలకృష్ణ (ఫొటో ట్విట్టర్)

Highlights

Akhanda: 'సింహా', 'లెజెండ్' వంటి 2 సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ గా రానున్నాడు.

Akhanda: 'సింహా', 'లెజెండ్' వంటి 2 సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ గా రానున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో బాలకృష్ణను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో కొన్ని బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని, బాలయ్య బాబు ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ అవతారంలో కనిపించబోతున్నారంట. ప్రస్తుతం ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

సంచలనం ప్రకారం, సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో విజువల్స్ మెయిన్‌ హైలైట్ గా ఉంటాయని సమాచారం. అలాగే కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు, హై-ఓల్టేజీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఎపిసోడ్‌లోనే బాలయ్య రెండవ పాత్ర ఎంట్రీ ఇస్తుందంట.

మిరియాలా రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories