Bharateeyudu 2: కాజల్ స్థానంలో తమన్నాని రంగంలోకి దింపనున్న దర్శకనిర్మాతలు

Bharateeyudu 2: భారతీయుడు-2 సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్..

admin1
Updated on: 6 Dec 2021 5:33 PM IST
Milky Beauty  Tamannaah as the Heroine in Indian-2
X

 భారతీయుడు-2 సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్

Bharateeyudu 2: 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ "భారతీయుడు" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా ఈ చిత్ర సీక్వెల్ గా "భారతీయుడు-2" సినిమా ప్లాన్ చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైంది అప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదుర వుతూనే ఉంది. మొదట బడ్జెట్ విషయంలో డైరెక్టర్ శంకర్ మరియు లైకా ప్రొడక్షన్స్ వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆఖరికి లైకా వారు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక త్వరలో షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు.

ఈ మధ్యనే కమల్ హాసన్ కోలుకున్నారు కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతుండడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా త్రిష ని సంప్రదించారు దర్శకనిర్మాతలు. ఆ తరువాత తమన్నా పేరు కూడా బయటకు వచ్చింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మాత్రమేకాక వయసుమళ్ళిన పాత్రలో కూడా కనిపించాల్సి ఉంటుంది. కాబట్టి తమన్నా అయితే ఈ రెండు పాత్రలకి న్యాయం చేస్తుందని చిత్రబృందం భావిస్తోంది. అందుకే గ్రీన్ సిగ్నల్ కూడా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story