Liger Movie: మైక్ టైసన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. !

Liger Movie: విజయ్ దేవరకొండ ఈ మధ్యనే "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Arun Chilukuri
Updated on: 1 Sept 2022 3:15 PM IST
Mike Tyson Remuneration for Liger Movie
X

Liger Movie: మైక్ టైసన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. !

Liger Movie: విజయ్ దేవరకొండ ఈ మధ్యనే "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి.

ఈ సినిమాలో మైక్ టైసన్ ఎక్స్టెండెడ్ క్యామీయో పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మైక్ టైసన్ తన కామియో పాత్ర కోసం ఏకంగా 25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 15 కోట్లు మాత్రమే మైక్ టైసన్ రెమ్యూనరేషన్ అని మిగతాది షూటింగ్ మరియు ఇతరత్రా ఖర్చులకు అయిపోయిందని సమాచారం. కానీ మైక్ టైసన్ కామియో పాత్ర కూడా సినిమాకి అంతగా ప్లస్ అవ్వలేకపోయింది.

నిజానికి 1980 మరియు 1990 లో మైక్ టైసన్ కి ఉన్న క్రేజ్ ప్రస్తుతం జనరేషన్లో లేదనే చెప్పుకోవాలి. అంతేకాకుండా మరోవైపు మైక్ టైసన్ పాత్ర కూడా సినిమాలో ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఏదేమైనా మైక్ టైసన్ రెమ్యూనరేషన్ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story