ప్రెగ్నెన్సీ మరియు విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య

*ప్రెగ్నెన్సీ మరియు విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య

Rama Rao
Published on: 29 Oct 2022 7:29 PM IST
Miheeka Bajaj Reacts to Pregnancy Rumours | Tollywood News
X

ప్రెగ్నెన్సీ మరియు విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య

Miheeka Bajaj: 2020 ఆగస్టు 8న కరోనా సమయంలో టాలీవుడ్ హీరో రానా మిహికా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మిహికా బజాజ్ ప్రెగ్నెంట్ అని రానా మరియు మిహికా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ పుకార్ల పై రియాక్ట్ అయింది మిహికా బజాజ్.

ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆమె ప్రెగ్నెంట్ కాదని కానీ తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది మిహికా. ఇక వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఆమె తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ మిహికా బజాజ్ తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

సినిమాలపరంగా చూస్తే రానా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ మధ్యనే రానా హీరోగా నటించిన "విరాటపర్వం" సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా ఇప్పుడు రానా తన బాబాయి వెంకటేష్ తో కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అంతేకాకుండా రానా కొన్ని స్క్రిప్ట్లను కూడా వింటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story