Michael: క్రైమ్‌కి మతం లేదు 'మైకేల్' ట్రైలర్ రిలీజ్

Michael: కిరణ్ దర్శకత్వంలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం 'మైకేల్'

Samba Siva Rao
Updated on: 14 May 2021 10:45 PM IST
Michael Official Trailer
X

‘మైకేల్

Michael: కిరణ్ దర్శకత్వంలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం 'మైకేల్'. వన్ మీడియా బ్యానర్‌పై పార్ధు రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. సాయి చరణ్ తేజ్, ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ ప్రధాన పాత్రలలో న‌టించారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. క్రైమ్‌కి మతం లేదు అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌లో క్రైమ్‌కి సంబంధించిన అనేక కోణాలను చూపించారు. ముఖ్యంగా డ్రగ్స్, మనీ వంటి వాటిని హైలెట్ చేశారు. ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ''సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమాని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం..ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది'' అన్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story