Mega Vs Allu: మెగా వర్సెస్ అల్లు.. ఎం పీకలేరు బ్రదర్!

Mention of Allu Arjun who is Not in the Mega Meeting
x

Maga Vs Allu: మెగా వర్సెస్ అల్లు.. ఎం పీకలేరు బ్రదర్!

Highlights

Mega Vs Allu: గతంలో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ హాట్ కామెంట్స్

Maga Vs Allu: మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు , ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు హీరో అల్లు అర్ఙున్. అయితే ఇప్పుడదే మెగాభిమానుల మధ్య అగాధానికి కారణమయిందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తొంది. దీనికి కొద్ది రోజుల క్రితం జరిగిన మెగాభిమానుల మీటింగ్ కూడా బలాన్ని చేకూర్చింది. మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా మారిన పరిస్దితి చివరికి ఫ్యాన్ వార్ లకు దారి తీస్తోంది. దీని వల్ల నష్టపోతుంది కూడా సదరు మెగా హీరోలేనట.

సినీ పరిశ్రమలో చిరంజీవి కుటుంబ హీరోగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. కానీ స్టార్ హీరోల్లో ఒకరుగా ఎదిగాడు. కానీ బన్నీ ఫౌండేషన్ పడింది మెగా క్యాంప్ నుంచే. ఐతే ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ ఈ మెగా క్యాంప్‌కు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల పాటు, ఫామ్‌ను కోల్పోయి, అల వైకుంఠపురం చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన బన్నీ నాటి నుంచి తన దారి వేరు ప్లాన్ వేరు అన్నట్టుగా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో తనని తాను ఐకాన్ స్టార్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటూ చిరంజీవి తర్వాత ఆ కుటుంబంలో ఆ స్థాయికి రీచ్ అయిన హీరోగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడదే మెగా అభిమానులకు నచ్చటం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనె అల్లు అర్జున్ తనకంటూ వేరే టీమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మెయింటేన్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్. పుష్ప సినిమా రిలీజ్ టైమ్‌లో ఫ్యాన్ మీట్స్ అంటూ తన రేంజ్ ఎంటో చూపించే ప్రయత్నాలు చేశారట. ఇదంతా చూసిన చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల్లో అల్లు అర్జున్ మెగా హీరోగా కాకుండా అల్లు వారి వారసుడిగానే భావించాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారట.

కొద్ది రోజుల క్రితం మెగా అభిమానులు విజయవాడలో నిర్వహించిన మీటింగ్‌లో సైతం అల్లు అర్జున్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశం అయింది.‌ వారి సమావేశంలో కూడా చిరంజీవి, చరణ్, పవన్ కల్యాణ్‌ల గురించిన చర్చే ప్రధానంగా వచ్చింది. అయితే మీటింగ్ అనంతరం ఏం పీకలేరు బ్రదర్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం వివాదాస్పదం అయింది. తమ హీరోను ఎవాయిడ్ చేసినందుకే అల్లు అర్జున్ అభిమానులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారన్న ప్రచారం మొదలయ్యింది. గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, అల్లు అర్జున్ నేనేమీ చెప్పను బ్రదర్ అనడంతో పవన్ ఫాలోవర్స్ అల్లు అర్జున్‌ను ట్రోల్ చేశారు. అప్పటి నుండి కొందరు పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ను మెగా హీరోగా చూడమని కామెంట్లు షేర్ చేశారు.

తాజాగా అదే తరహాలో ఏం పీకలేరు బ్రదర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేయటం వెనుక తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్న విషయాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి మెగాభిమానులందరు, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా నిలబడాలన్న తీర్మానం‌ కోసమే బెజవాడలో మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ మీటిం‌గ్‌లో భాగంగా వేసిన ఫ్లెక్సీలలో అల్లు అర్జున్ ఫోటో లేదు. అంతే అల్లు అర్జున్‌ను మెగా హీరోగా కన్సిడర్ చేయడం లేదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేశారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. అప్పుడు తమ హీరో సపోర్ట్ తీసుకుని, ఇప్పుడు మాత్రం పక్కకు పెట్టెశారన్న బాధతో, అల్లు అర్జున్ అభిమానులు చెలరేగిపోతున్నారట.

నిజంగా మెగా అల్లు కుంటుబాల మధ్య ఏ గొడవా ఏమీ లేదు. ఎవరి టాలెంట్ వారిది. ఎవరి బిజినెస్ వారిది అన్నట్టుగా సినిమాలు చేసుకుంటున్నారు. ‌కానీ లేని మనస్పర్ధలు ఉన్నట్టుగా కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతోన్న ఫ్యాన్ వార్‌ చూస్తున్న వారు వీటిని కట్టడి చేయాలంటే స్వయానా రామ్ చరణ్, బన్నీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆల్రెడీ ఆచార్యకు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ రాకపోడానికి అభిమానులే కారణమని వారు ఎవాయిడ్ చేయటం వల్లే సినిమాకు ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదన్న వర్షన్ కూడా ఉంది. ఈ మొత్తం ఊహాగానాలకు తెరపడాలంటే అగ్రతారలు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories