ప్రభాస్ తో సినిమా ఆఫర్ కొట్టేసిన మెహరీన్ పిర్జదా

Mehreen Pirzada who made a movie offer with Prabhas
x

ప్రభాస్ తో సినిమా ఆఫర్ కొట్టేసిన మెహరీన్ పిర్జదా

Highlights

Prabhas- Meharin: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

Prabhas- Meharin: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వరుసగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ తాజాగా మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశారు. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను దర్శక నిర్మాతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, సలార్ లో శృతి హాసన్, ఆదిపురుష్ లో బాలీవుడ్ భామ క్రితి సానన్, ప్రాజెక్ట్ కే లో దీపికా పడుకొనే వంటి స్టార్ హీరోయిన్లు ప్రభాస్ హీరోయిన్ల జాబితాలో ఉన్నారు. తాజాగా ఇప్పుడు కరియర్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మెహరీన్ ను హీరోయిన్ గా అనుకుంటూ ఉండటంతో అందరూ షాక్ కి గురి అవుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మెహరీన్ కి ఇది కొరియర్ లో పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories