Mehreen: ప్రస్తుతం పెళ్లిపై ఆలోచన లేదు!

Mehreen: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో మెహ్రీన్ కౌర్ ఒకరు.

Venkata Chari
Updated on: 27 May 2021 10:00 PM IST
Mehreen not thinking about marriage!
X

మెహ్రీన్ కౌర్ (ఫొటో ట్విట్టర్)

Mehreen: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో మెహ్రీన్ కౌర్ ఒకరు. ప్రస్తుతం ఈ నటి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో దూసుకపోతోంది. మెహ్రీన్ ఈ ఏడాది మొదట్లో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి కోసం ఎదురుచూస్తోంది. కానీ, ప్రస్తుతం పెళ్లి ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కొవిడ్-19 బారిన పడిన మెహ్రీన్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ.., మన చుట్టూ ఉన్న ప్రస్తుతం పరిస్థితుల మేరకు పెళ్లి గురించి ఆలోచించడంలేదని పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్నాను. కానీ, ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్ పొందలేదని, అందుకోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది.

తాను వర్కౌట్స్ చేస్తున్నానని, త్వరలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తానని పేర్కొంది. దేశంలో పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తామని తెలిపింది. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story