Mehreen Engagement: ఘనంగా మెహరీన్ ఎంగేజ్ మెంట్

Kranthi
Updated on: 13 March 2021 12:09 PM IST
Mehreen Engagement Pictures
X

ఇమేజ్ సోర్స్: (ఇనిస్టాగ్రమ్)

Mehreen Engagement: 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్‌', 'ఎఫ్‌2'తదితర సూపర్‌హిట్‌ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్‌. అంతే కాదు తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. తాజాగా ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ఓ కోట వీరి నిశ్చితార్థ వేడుకకు వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది మెహరీన్‌. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం.

హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడు...

మెహరీన్‌కు కాబోయే వరుడు భవ్య బిష్ణోయ్ హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మెహరీన్‌ తెలియజేసింది. నాని కథానాయకుడిగా నటించిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో మెహరీన్‌ తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story