కళ్యాణ్ రామ్ కి మెగాస్టార్ ట్యాగ్.. మొదలైన మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్..

#MegastarKalyanRam is Trending on Twitter
x

కళ్యాణ్ రామ్ కి మెగాస్టార్ ట్యాగ్.. మొదలైన మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్..

Highlights

Kalyan Ram: సోషల్ మీడియాలో #megastarkalyanram అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Kalyan Ram: సోషల్ మీడియాలో #megastarkalyanram అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కళ్యాణ్ రామ్ తాజా చిత్రం బింబిసార సక్సెస్‌ను నందమూరి అభిమానులు ఆస్వాదిస్తున్న తరుణంలో , మెగా హీరోల ఆచార్య ఫ్లాపును ఎక్కువగా గుర్తుకువచ్చేలా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఆచార్య అపజయంతో మూతపడిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను, కల్యాణ్ రామ్ బింబిసారతో పరుగులుపెటిస్తూన్నాడంటూ నందమూరి అభిమానులు హంగామా చేస్తున్నారు.

అందుకే మెగాస్టార్ అనే ట్యాగును కళ్యాణ్ రామ్‌కు జోడించేశారు‌. కల్యాణ్ అభిమానులు ఇలా ట్రెండ్ చేస్తుండటంతో, మరొపక్క మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. చిరంజీవి ట్యాగ్ ను కల్యాణ్ కు పెట్టడం పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ‌ఒక్క హిట్ కే ఇలా హంగామా చేయటం సరికాదన్న పోస్ట్ లు పడుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం అఖండ , ఆర్ఆర్ఆర్, బింబిసార విజయాలతో తమ హీరోలు వరుస సక్సెస్ లు కొట్టి, ఇండస్ట్రీ ని కాపాడగలిగారని గుర్తుచేస్తున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories