"ఖైదీ నెంబర్ 150" డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేయనున్న మెగాస్టార్

* "ఖైదీ నెంబర్ 150" డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేయనున్న మెగాస్టార్

Arun Chilukuri
Updated on: 22 Feb 2023 8:31 PM IST
Who Is The Director Of Chiranjeevi Next Movie
X

 చిరంజీవి నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "వాల్తేరు వీరయ్య" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి అందుకున్న మొట్టమొదటి సూపర్ హిట్టుగా "వాల్తేరు వీరయ్య" సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరే సినిమాకి సైన్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పుడు వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కథకు సంబంధించిన డిస్కషన్లు ఇంకా జరుగుతున్నాయట. ఒకవేళ కథ గనక ఫిక్స్ అయితే త్వరలోనే చిరంజీవి మరియు వివి వినాయక్ కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. అయితే 2017 లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రీ ఎంట్రీ సినిమా "ఖైదీ నెంబర్ 150" కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా "చత్రపతి" హిందీ రీమేక్ తో బిజీగా ఉన్న వివి వినాయక్ ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో సినిమా మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story