Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ ఫైర్.. ఇది సిగ్గుచేటు

మంత్రి సురేఖ వ్యాఖ్యలపై అగ్రనటులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హీరో ఎన్టీఆర్, నానిలు ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Oct 2024 10:08 AM IST
Megastar fire on Konda Surekhas comments
X

 Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ ఫైర్.. ఇది సిగ్గుచేటు

Chiranjeevi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగచైతన్య, సమంత, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంతోపాటు సినీపరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను నిరసిస్తూ సినీలోకమంతా ఏకతాటిపైకి వచ్చింది.

మంత్రి సురేఖ వ్యాఖ్యలపై అగ్రనటులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హీరో ఎన్టీఆర్, నానిలు ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

గౌరవనీయులైన మహిళా మంత్రిగారు చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి చాలా బాధపడ్డాను. త్వరగా వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేయడం చాలా సిగ్గు చేటు. సినీ ఇండస్ట్రీకి చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నాము.

రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారకూడదు. సమాజ అభివ్రుద్ధికోసం మేము నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని తగ్గించకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని చిరంజీవి పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story