శృతిహాసన్ ఆరోగ్యం గురించి కామెడీ చేసిన మెగాస్టార్

* శృతిహాసన్ హెల్త్ గురించి జోక్ చేసిన చిరంజీవి

Dhatripriya
Updated on: 9 Jan 2023 3:38 PM IST
MegaStar done Comedy About Shruti Haasan Health
X

శృతిహాసన్ ఆరోగ్యం గురించి కామెడీ చేసిన మెగాస్టార్

Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమా త్వరలోనే సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరొకవైపు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న మరొక సినిమా వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత శృతిహాసన్ కు బాగా జలుబు, దగ్గు మొదలయ్యాయి.

టెస్ట్ చేస్తే ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది అని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ఒంట్లో బాగో లేకపోవడం వల్ల తాను "వాల్తేరు వీరయ్య" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తాను రాలేనని చెప్పి ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది శృతి. "ఇవాళ ఈవెంట్ కి హాజరు అవ్వలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ నాకు అస్సలు ఒంట్లో బాలేదు," అని శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే తాజాగా ఈవెంట్ లో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి దీని గురించి జోక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

"అసలు తన ఒంగోలులో ఏం తినిందో ఏంటో లేదా ఆమెను ఎవరైనా బ్లాక్ మెయిల్ ఏమన్నా చేశారేమో," అంటూ శృతిహాసన్ గురించి జోక్ చేశారు చిరంజీవి. దీంతో అక్కడున్న ప్రేక్షకులు కూడా నవ్వేశారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story