Chiranjeevi: మురుగదాస్‌తో మెగాస్టార్ కొత్త సినిమా.. సక్సెస్ కోసం అలాంటి కథతో..!

Murugadoss: భోళా శంకర్ సినిమా రిజల్ట్‌తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 19 Aug 2023 4:06 PM IST
Megastar Chiranjeevis Next Movie With AR Murugadoss
X

Chiranjeevi: మురుగదాస్‌తో మెగాస్టార్ కొత్త సినిమా.. సక్సెస్ కోసం అలాంటి కథతో..!

Chiranjeevi: భోళా శంకర్ సినిమా రిజల్ట్‌తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోకాలి శస్త్రచికిత్స కారణంగా చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తదుపరి సినిమా అప్‌డేట్ కోసం మరో నెల రోజులు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. ఈ మధ్య చిరు , తమిళ దర్శకుడు మురుగదాస్ సినిమా గురించి ఓ వార్త వైరల్‌గా మారింది.

ఒకప్పుడు మురుగదాస్ సినిమాలన్నీ టార్గెట్ హిట్స్ అయితే.. అతని సినిమాలు రాను రాను కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. రజనీ దర్బార్ ఛాన్స్ ఇచ్చినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో సినిమా డిస్కషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈలోగా చిరు , మురుగదాస్ కాంబో సరైన కంటెంట్‌తో వస్తే రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇంతకీ మురుగదాస్ కథను సిద్ధం చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకప్పుడు పాన్ ఇండియా హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు మురుగదాస్.. తన పాత ఫాంకు తిరిగి రావాలని అభిమానులు కోరుతున్నారు. శివకార్తికేయన్‌తో మురుగదాస్ సినిమా దాదాపు ఖరారైందని కోలీవుడ్ టాక్. మరి ఆ సినిమా తర్వాత చిరు సినిమా ఉంటుందో లేదో చూడాలి. భోళా శంకర్ తర్వాత బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ షార్ట్ ఫిల్మ్ రానుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తుండగా, ఆ సినిమా నుంచి మెగాస్టార్ కాస్త వెనక్కి తగ్గుతున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story