Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అరుదైన గిన్నీస్ రికార్డు.. ఆయన పేరు ఎలా నమోదైంది?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అరుదైన గిన్నీస్ రికార్డు.. ఆయన పేరు ఎలా నమోదైంది?

Arun Chilukuri
Updated on: 22 Aug 2025 11:30 AM IST
Megastar Chiranjeevis Name Enters Guinness Book of Records
X

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అరుదైన గిన్నీస్ రికార్డు.. ఆయన పేరు ఎలా నమోదైంది?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (ఆగస్టు 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు 70 ఏళ్లు నిండినా, ఇప్పటికీ యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నారు. గత సంవత్సరం ఆయనకు చాలా ప్రత్యేకమైనది. ఒకవైపు కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. మరోవైపు ఆయన పేరు ఒక అరుదైన గిన్నీస్ రికార్డులో కూడా నమోదైంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1978లో పునాది రాళ్లు సినిమాతో చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటివరకు 156కు పైగా సినిమాల్లో నటించారు. నటనతో పాటు, డ్యాన్స్ విషయంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన డ్యాన్స్ స్టెప్పులను అప్పట్లో చాలామంది అనుకరించేవారు.

చిరంజీవి తన కెరీర్‌లో ఇప్పటివరకు 537 పాటల్లో డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన మొత్తం 24,000 స్టెప్పులు వేశారని అంచనా. ఈ అసాధారణమైన ఘనత కారణంగా, భారతీయ సినిమాలోనే అత్యంత ప్రావీణ్యం కలిగిన స్టార్ గా ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ ప్రత్యేక సర్టిఫికేట్‌ను ఆయన అందుకున్నారు.

ఈ అరుదైన కార్యక్రమానికి అశ్విని దత్తా, బి. గోపాల్, సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, బాబీ, గుణశేఖర్, వశిష్ట, సుష్మిత, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ వేడుకకు వచ్చి చిరంజీవిని అభినందించారు. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో అవార్డులు అందుకోవడంతో చిరంజీవి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరంజీవి సాధించిన ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టడం అంత సులభం కాదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story