Acharya Updates: ఆచార్యలో ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Acharya Updates: ఆచార్యలో ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!
x
Highlights

Acharya Updates: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.

ఆచార్య ఉపాదాట్లు: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వేగంగా అజరుగుతోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పార్టీ షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది. కొరటాల క్రియాంజీవి కాంబినేషన్ పై పెద్ద అంచనాలే ప్రేక్షకుల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఒక పాత్రకు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో చిరంజీవి కొరటాల శివకు మెహబూబ్ పేరు ఒక పాత్రకోసం సూచించారని.. దానికి కొరటాల కూడా అంగీకరించి మెహబూబ్ ను ఆచార్యలో నటించి ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్ టాక్.

ఇటీవల బిగ్ బాస్ ౪ తెలుగు గ్రాండ్ ఫినాలే లో చిరంజీవి గెస్టుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెహబూబ్ కి పదిలక్షల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాకుండా.. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. అదేవిధంగా మెహబూబ్ ను చూస్తే అప్పట్లో తాను ఎంత ఎనర్జిటిక్ గా ఉండేవాడినో అంత ఎనర్జిటిక్ గా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మెహబూబ్ డ్యాన్సుల్ని విపరీతంగా పొగిడారు. సాధారణంగా చిరంజీవి టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహిస్తారు. రవితేజ వంటి హీరోలు ఇలా చిరంజీవి ప్రోత్సాహంతో పైకి వచ్చిన వారే. ఇప్పుడు మెహబూబ్ చిరంజీవి దృష్టిలో పడటం అతనికి వెంటనే తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడం అంతా సూపర్ స్పీడ్ గా జరిగిపోయాయి.

బిగ్ బాస్ ౪ కంటెస్టెంట్లు ఇంతకు ముందు మూడు సీజన్లలో కంటెస్టెంట్ల కంటే భిన్నంగా వెంట వెంటనే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే దివి కి కూడా చిరంజీవి తన తరువాతి సినిమా వెడలంలో O కీలక పాత్ర ఇచ్చారు. అదేవిధంగా సోహెల్ చేసే సినిమాలో అతిథి పాత్రలో నటిస్తానని చెప్పారు. ఇలా అందరినీ ప్రోత్సహిస్తున్న చిరంజీవి అన్న మాట నిలబెట్టుకోవడంలో వేగంగా ముందున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా మెహబూబ్ కు మంచి కెరీర్ పునాది పడబోతోంది. దానిని ఎంత చక్కగా మెహబూబ్ వినియోగించుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories