కృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్

Megastar Chiranjeevi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం "రంగమార్తాండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri
Updated on: 28 Jun 2022 9:15 PM IST
Megastar Chiranjeevi Unique Attempt for Rangamarthanda
X

కృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్

Megastar Chiranjeevi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం "రంగమార్తాండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణాంతర పనులతో చిత్ర బృందం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకోసం బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని తెలిసిన విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ తెలుగులో కొన్ని కవిత్వాలు కూడా చెప్పబోతున్నారు అని తెలుస్తోంది.

ఒక నటుడు జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది అని తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ముప్పై ఏళ్లుగా ఒక నటుడిగా ఎందరో అభిమానుల మనసులను దోచుకున్న చిరంజీవి సినిమాలో చెప్పబోతున్న కవిత్వాలు పద్యాలు అభిమానులకు బాగా నచ్చుతాయని తెలుస్తోంది. అటు డైలాగులు ఇటు పాట కాకుండా అద్భుతమైన లిరిక్స్ ఉన్న కవిత్వాలు చెప్పటం చిరంజీవికి చాలా కొత్తగా అనిపించి వెంటనే ఒప్పుకున్నారట. శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీ గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story