Chiranjeevi: మోగిలయ్య జీవితంలో వెలుగు నింపిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి

Jyothi
Published on: 18 April 2023 4:34 PM IST
Megastar Chiranjeevi to Help for Balagam Mogilaiah Eye Surgery
X

Chiranjeevi: మోగిలయ్య జీవితంలో వెలుగు నింపిన మెగాస్టార్ చిరంజీవి 

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లాగానే ఆయన మనసు కూడా ఎంతో విశాలమైనది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్‌లు ఇలా కష్ట సమయాల్లో చిరంజీవి ఎన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా ఇప్పుడు మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరు. వివరాల్లోకి వెళితే, బలగం మొగిలయ్య తీవ్ర అనారోగ్యం పాలై ఇప్పుడు హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడం, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి తీవ్ర సమస్యలతో కంటి చూపు కూడా కోల్పోయారు.టాలీవుడ్‌లో ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా నేనున్నాను అంటూ ప్రత్యక్షమయ్యే చిరంజీవి ఈ సారి కూడా తన అభయ హస్తాన్ని చూపించారు. మొగిలయ్య కి తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు చిరంజీవి.

"బలగం" డైరెక్టర్‌ వేణుకి ఫోన్‌ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారట. ఈ విషయాన్ని వేణు మొగిలయ్య కు తెలియజేయగా, మొగిలయ్య దంపతులు ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్‌ సాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. చిరంజీవి తో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కూడా మొగిలయ్య ను పరామర్శించి తనకి అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story