మెగా అభిమానులకు శుభవార్త! మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగెటివ్!

మెగా అభిమానులకు శుభవార్త! మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగెటివ్!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా రావడం కేవలం కోవిడ్ కిట్ సమస్య వల్లే అని అని చిరంజీవి తెలిపారు. తనకు కరోనా రాలేదని ఆయన వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త! ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయం విన్న దగ్గరనుంచి అందరిలోనూ ఆందోళన వ్యక్తం అయింది. అయితే, ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో తలెత్తిన లోపంతోనే కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నెగెటివ్ అనీ.. అయితే, మొదటిసారి తనకు చేసిన పరీక్షల్లో పొరపాటున కరోనా కిట్ ఫెయిల్ కావడం వల్ల రిజల్ట్ తప్పు వచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. కొంత మంది ప్రత్యెక డాక్టర్ల బృందం తనకు మళ్ళీ పరీక్షలు నిర్వహించిందనీ.. ఆ పరీక్షల్లో తనకు కరోనా నెగెటివ్ గా తెలిందనీ చిరంజీవి పేర్కొన్నారు.

తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా..కన్ఫ్యూజన్ రెండూ కలిపి తనతో ఆడేసుకున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. పాజిటివ్ అని చెప్పాకా, బేసిక్ మెడికేషన్ ప్రారంభించాను. కానీ, ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం తో అనుమానం వచ్చి మళ్ళీ అపోలో లో పరీక్షలు చేయించుకున్నాను అని అయన వివరించారు. అయన ట్వీట్ మీకోసం..



Show Full Article
Print Article
Next Story
More Stories