Chiranjeevi: ఆస్తి గురించి షాకింగ్ కామెంట్లు చేసిన చిరంజీవి..

Chiranjeevi: ఆస్తి గురించి షాకింగ్ కామెంట్లు చేసిన చిరంజీవి

Jyothi
Updated on: 10 Jan 2023 9:31 PM IST
Megastar Chiranjeevi says I bought land in Vizag
X

Chiranjeevi: "వైజాగ్ లో ఒక ల్యాండ్ కొనుక్కున్నాను," అంటున్న మెగాస్టార్

Chiranjeevi: ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. ఒక్కో సినిమాకి లక్షల నుంచి కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు హైదరాబాద్ లేదా వేరే ఇతర ప్రాంతాల్లో ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పటిదాకా ఒక హీరో కూడా తమకున్న ఆస్తుల గురించి ఓపెన్ గా మీడియా ముఖంగా మాట్లాడింది లేదు. నిన్న మొన్నటిదాకా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎప్పుడూ తనకున్న ఆస్తి గురించి కామెంట్లు చేయలేదు. కానీ తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ వైజాగ్ మీద తనకి ఉన్న ప్రేమాభిమానాలు గురించి చెబుతూ అక్కడ తనకి ఉన్న ఒక ల్యాండ్ గురించి కూడా చెప్పేసారు చిరంజీవి.

గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిలిం సెలబ్రిటీలకు వైజాగ్ లో ఫ్రీగా కొన్ని లాండ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా ఎవరూ కూడా వైజాగ్ కి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకున్నది లేదు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ వైజాగ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు చిరు. "వైజాగ్ చాలా పీస్ ఫుల్ సిటీ.

రిటైర్ అయిపోయాక ఎవరైనా ఇలాంటి ఒక అందమైన సిటీలో స్థిరపడొచ్చు. ఈ మధ్యనే నేను కూడా భీమిలి రోడ్డులో ఒక ల్యాండ్ ని కొనుక్కొని వైజాగ్ వాస్తవ్యుడిగా మారాను. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ మాత్రం ఏమీ మొదలు పెట్టలేదు," అని వైజాగ్ లో తాము కొన్న ఒక ల్యాండ్ గురించి బయటపెట్టేసారు చిరంజీవి. అయితే ఇంత సడన్గా వైజాగ్ లో తమకున్న ఆస్తి గురించి చిరంజీవి బయటకు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story