Adbhutham - Chiru Tweet:"అద్భుతం" సినిమా గురించి ట్వీట్ చేసిన చిరంజీవి

"అద్భుతం" చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

admin1
Updated on: 25 Nov 2021 8:08 PM IST
Megastar Chiranjeevi Says Congrats to Adbhutham Movie Team for Their Success in Twitter - Movie News Today
X

Adbhutham - Chiru Tweet: "అద్భుతం" సినిమా గురించి ట్వీట్ చేసిన చిరంజీవి

Chiranjeevi Tweets - Adbhutham Movie: చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా మంచి సినిమాలని సపోర్ట్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ముందే ఉంటారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఈ మధ్యనే విడుదలైన ఒక సినిమా గురించి ట్వీట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "అద్భుతం" అనే ఒక సినిమాని విడుదల చేసింది.

న్యూ ఏజ్ సినిమాగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జ మరియు రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. హాట్ స్టార్ లో స్ట్రీం అవుతున్న ఈ సినిమా ఇప్పుడు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా చాలా బాగుందంటూ నటీనటులను మరియు దర్శకనిర్మాతలను కొనియాడారు. "నిన్న రాత్రి హాట్ స్టార్ లో అద్భుతం సినిమా చూశాను. ఒక ఎంగేజింగ్ నోవెల్ కాన్సెప్ట్ తో వచ్చిన న్యూ ఏజ్ సినిమా ఇది. తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్ పర్ఫామెన్స్ చాలా బాగుంది. వాళ్లకి మంచి ఫ్యూచర్ ఉండబోతోంది. సినిమా హిట్ అయినందుకు దర్శకనిర్మాతలకు నా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు చిరంజీవి.


admin1

admin1

Next Story