చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నాకు రాజ్యసభ ఆఫర్ చేసిందనేది అవాస్తవం..

Megastar Chiranjeevi: రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 14 Jan 2022 5:22 PM IST
Megastar Chiranjeevi Response On Rajya Sabha Ticket Controversy
X

చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నాకు రాజ్యసభ ఆఫర్ చేసిందనేది అవాస్తవం..

Megastar Chiranjeevi: రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు.

సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నిన్న మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా డోకిపర్రు వెళ్తున్న చిరంజీవిని రాజ్యసభ సీటు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ మేరకు ఆయన స్పందించారు. డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కల్యాణోత్సవానికి చిరు హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story