Megastar Chiranjeevi Praises Bluff Master Director: 'బ్లఫ్ మాస్టర్'కు మెగాస్టార్ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిపించి..

Megastar Chiranjeevi Praises Bluff Master Director: బ్లఫ్ మాస్టర్కు మెగాస్టార్ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిపించి..
x
Megastar Chiranjeevi
Highlights

Megastar Chiranjeevi Praises Bluff Master Director: తెలుగులో చిన్న సినిమాగా వచ్చిన 'బ్లఫ్ మాస్టర్' ఎంతంటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే..

Megastar Chiranjeevi Praises Bluff Master Director: తెలుగులో చిన్న సినిమాగా వచ్చిన 'బ్లఫ్ మాస్టర్' ఎంతంటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. 2018 డిసెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకులు సైతం ఈ సినిమా పైన ప్రశంసలు కురిపించారు. తమిళంలో హిట్ అయిన ''శతురంగ వెట్టై" చిత్రానికి ఇది రీమేక్.. సత్యదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా తెరకేక్కిన ఈ సినిమాకి గోపీ గణేష్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ సినిమాని చూసిన మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలుపించుకుని అభినందించారు.

లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న చిరంజీవి పలు సినిమాలను వీక్షిస్తున్నారు . అందులో భాగంగా 'బ్లఫ్ మాస్టర్' సినిమాను చూసిన మెగాస్టార్ కి ఈ సినిమా బాగా నచ్చడంతో డైరెక్ట్ గా దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలుపించుకుని అభినందించారు. ఈ విషయాన్ని గోపీ గణేష్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా గోపీ గణేష్‌ మాట్లాడుతూ.. " సినిమాని చూసి ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు.. మీరు విశాల హృదయులు. నా గురించి మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ నా హృదయంలో పదిలంగా ఉంటాయి. థాంక్యూ సార్ " అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అటు గత ఏడాది సైరా నరసింహ రెడ్డి సినిమాతో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు కొరటాల శివతో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ ఫస్ట్ టైం మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది..


Show Full Article
Print Article
Next Story
More Stories