నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌..

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Published on: 29 Jan 2022 1:44 PM IST
Megastar Chiranjeevi Pens Birthday Wishes to his Mother Anjana Devi
X

నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌..

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. కోవిడ్‌ బారిన పడక తప్పలేదంటూ ఆయన ఇటీవల ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. శనివారం తన తల్లి పుట్టినరోజు పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా చిరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోని ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు.

'అమ్మా... జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు, మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. అభినందనలతో... శంకరబాబు' అని ట్వీట్ చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయం తెలిసిందే. ఆయనను తల్లి ప్రేమగా 'శంకరబాబూ' అంటూ పిలుచుకుంటారు. అందుకే తన తల్లికి శుభాకాంక్షలను తెలిపే క్రమంలో తన పేరును ఆయన శంకరబాబు అని పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story