Chiranjeevi: నవంబర్ లో రెండు సినిమాలు లాంచ్ చేయబోతున్న మెగాస్టార్

* ఒకే వారంలో రెండు సినిమాలు లాంచ్ చేస్తున్న చిరు

admin1
Updated on: 24 Oct 2021 7:15 PM IST
MegaStar Chiranjeevi Launching his Two Movies in November 2021
X

Chiranjeevi: నవంబర్ లో రెండు సినిమాలు లాంచ్ చేయబోతున్న మెగాస్టార్

Chiranjeevi New Movies: వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఆచార్య" సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమా రీమేక్ గా తెరకెక్కనున్న "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా బాబీ మరియు మెహర్ రమేష్ సినిమాలు కూడా సైన్ చేశారు మెగాస్టార్.

కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న సినిమా ని వచ్చేనెల నవంబర్ 6న హైదరాబాద్ లో లాంచ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. "గాడ్ ఫాదర్" షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

నవంబర్ 11న మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న "భోళా శంకర్" సినిమాని ఒక పూజతో అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్లో హైదరాబాద్లోని ఒక స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నారు.

admin1

admin1

Next Story