Megastar Chiranjeevi: ఓటీటీ మీద కన్నేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు మెగాస్టార్.

Arun Chilukuri
Published on: 7 July 2022 2:59 PM IST
Megastar Chiranjeevi Interesting In Working On Web Series
X

Megastar Chiranjeevi: ఓటీటీ మీద కన్నేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు మెగాస్టార్. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక మెగా అభిమానులను కూడా నిరాశపరిచింది. ఇక మెగాస్టార్ తన తదుపరి సినిమాల పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఒకవైపు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరంజీవి తాజాగా ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన తోటి సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్ వంటి వారు మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి దూరంగా ఉంటున్న సమయంలో చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్ వారితో కలిసి ఒక వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కంటెంట్ హెడ్లను కూడా కలిసి వెబ్ సిరీస్ చేయమని చెబుతున్నారట. కానీ హీరోలకి ఉన్న మాస్ ఇమేజ్ థియేటర్లలో వర్క్ అవుతుంది కానీ వెబ్ సిరీస్ లో కంటెంట్ మాత్రమే ముఖ్యం. అలాంటిది చిరంజీవి చేసే సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు కంటెంట్ బాగుంటే నెగిటివ్ పాత్ర చేయడానికి కూడా చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story