Chiranjeevi Impressed : అభిమాని వీడియోకి మెగాస్టార్ ఫిదా!

Chiranjeevi Impressed : అప్పట్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. ఈ సినిమాలో నాగరాజు

Krishna
Updated on: 28 Aug 2020 2:28 PM IST
Chiranjeevi Impressed  : అభిమాని వీడియోకి మెగాస్టార్ ఫిదా!
X

Megastar chiranjeevi impressed for recreation of challenge movie song 

Chiranjeevi Impressed : అప్పట్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. ఈ సినిమాలో నాగరాజు అనే పాత్ర బాగా పాపులర్ అయింది.. ఆ పాత్రలో సుధాకర్ కోమాకుల నటించాడు.. ఆ తర్వాత చాలా సినిమాల్లోనే నటించాడు కానీ అవి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు.. ఇక ఇది ఇలా ఉంటే సుధాకర్ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద వీరాభిమాని.. తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ తన భార్య హారికతో కలిసి మెగాస్టార్ కి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు.. ఈ గిఫ్ట్ కి మెగాస్టార్ సైతం ఫిదా అయిపోయారు.

హీరోగా చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'ఇందువదన కుందరదన.. పాటను రీక్రియేట్ చేసి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా సోషల్
మీడియాలో రిలీజ్ చేశాడు... ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బర్త్ డే గిఫ్ట్ కు చిరంజీవి ఫిదా అయిపోయారు. వారికి అభినందనలు తెలుపుతూ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.. పాటను చాలా అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తారు చిరు. ఆ పాట తీస్తున్నంత సేపు తనను తలుచుకోవడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. మీరు ఇలా చేయడం వలన మీరు ఉహించిన దానికంటే ఎక్కువ ఆనందిస్తున్నానని అన్నారు.. మీరు ఇండియాలో ఉంటే నా సంతోషాన్ని ఇంకోలా చూపించేవాడిని అని అమెరికాలో ఉన్నారు కనుక వ్యక్తిగతంగా మీ ఇద్దర్నీ కలవలేకపోతున్నానని కలకాలం హాయిగా ఉండండి అంటూ వారిని ఆశీర్వదించారు చిరంజీవి..



ప్రసుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.



Krishna

Krishna

Next Story