'ఆర్‌ఆర్‌ఆర్‌'లో చిరంజీవి?

ఆర్‌ఆర్‌ఆర్‌లో చిరంజీవి?
x
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

అంతా స్టార్స్ తోనే తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పుడు మరో స్టార్ చేరబోతున్నాడు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అవును.. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని రామ్‌ చరరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఉండబోతుందట. అయితే ఆ వాయిస్ కొరకు రాజమౌళి చిరును సంప్రదించగా, చిరు కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. అటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.

ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కే విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories