Megastar Chiranjeevi: చిరంజీవి ఎదుర్కున్న ఘోర అవమానాలు

Megastar Chiranjeevi: ఇండస్ట్రీకి వెన్నెముకగా నిలిచే చిరంజీవి సినీ వర్కర్ల కి ఎటువంటి సహాయం చేయడానికి వెనుకాడరు.

admin1
Updated on: 3 Jan 2022 11:45 AM IST
Megastar Chiranjeevi Felt Insulted with These Two Things | Tollywood News
X

Megastar Chiranjeevi: చిరంజీవి ఎదుర్కున్న ఘోర అవమానాలు

Megastar Chiranjeevi: ఇండస్ట్రీకి వెన్నెముకగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి సినీ వర్కర్ల కి ఎటువంటి సహాయం చేయడానికి వెనుకాడరు. తాజాగా చిరంజీవి ఒక డయాగ్నొస్టిక్ సెంటర్ వారితో కలిసి సినీ వర్కర్లకు 50% డిస్కౌంట్ వచ్చేలాగా హెల్త్ కార్డ్స్ ఇస్తూ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. చిరంజీవిని అందరూ టాలీవుడ్ కి పెద్ద దిక్కు అని అంటారని తెలిసిందే.

దీని గురించి మాట్లాడుతూ చిరంజీవి, "నేను టాలీవుడ్ పెద్దగా ఉండాలని అనుకోవడం లేదు. నాకు ఆ స్థానం అవసరం కూడా లేదు. ఇరువర్గాల గొడవలను తీర్చాలని నేను అనుకోవడం లేదు. కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం నేను కచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తాను" అని అన్నారు.అయితే బావోద్వేగం అయిన చిరంజీవి మాటలు విన్నాక అభిమానులు కూడా చాలా బాధ పడ్డారు. చిరంజీవి ఇలా మాట్లాడటానికి కారణం ఆయన కొన్ని విషయాల్లో చాలా మనస్థాపానికి గురి అయ్యారు అని కొందరు చెబుతున్నారు.

అయితే దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. మొదట ప్రకాష్ రాజ్ ని చిరంజీవి మా ఎన్నికల్లో సపోర్ట్ చేసినప్పటికీ విష్ణు గెలవటం చిరంజీవిని బాధ పెట్టి ఉండొచ్చు. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ లోని టికెట్ రేట్లు గురించి మాట్లాడాలని చిరంజీవి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ వైయస్ జగన్ మాత్రం చిరంజీవి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇప్పటికి రెండుసార్లు అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేసి అవమానించటం కూడా చిరంజీవిని బాధపెట్టి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు.

admin1

admin1

Next Story