Megastar Chiranjeevi Cooking Fish : అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట.. వీడియో వైరల్!

Megastar Chiranjeevi Cooking Fish : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.. కరోనా వైరస్

Krishna
Published on: 10 Aug 2020 2:03 PM IST
Megastar Chiranjeevi Cooking Fish : అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట.. వీడియో వైరల్!
X
Megastar Chiranjeevi Cooking Fish For His Mother

Megastar Chiranjeevi Cooking Fish : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.. కరోనా వైరస్ పైన అవగాహన కల్పిస్తూనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు చిరంజీవి.. తాజాగా 'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు' చేస్తానని, దీనిని ఆదివారం సాయింత్రం విడుదల చేస్తానని ప్రకటించారు చిరంజీవి.. అయితే ఆ రోజు విజయవాడలో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కలత చెందిన అయన దానిని మరుసటి రోజుకు పోస్ట్ పోన్ చేశారు.

ఆ తరవాత సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేశారు చిరు.. 'అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట' అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక చిరు వంటకి ఫిదా అయినట్టుగా చరణ్ సతీమణి ఉపసాన కామెంట్ పెట్టింది. ఇక చిరు వంట కూడా అభిమానులకి బాగా నచ్చింది.


View this post on Instagram

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది..ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story