ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చేసిన మెగాస్టార్..

Chiranjeevi Twitter: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ...

Arun Chilukuri
Updated on: 16 April 2022 5:46 PM IST
Megastar Chiranjeevi Changed his Twitter Handle Name
X

ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చేసిన మెగాస్టార్..

Chiranjeevi Twitter: వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా పేరును మార్చాడు.

చిరంజీవి కొణిదెల అని ఉండే తన ట్విటర్‌ అకౌంట్‌ నేమ్‌ను 'ఆచార్య'గా మార్చుకున్నాడు. చిరు తాజాగా నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తన ట్విట్టర్ అకౌంట్ ను ఆచార్య గా చేంజ్ చేసి , సినిమా ప్రమోషన్ ను మొదలుపెట్టారు మెగాస్టార్.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story