తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు : చిరంజీవి

బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది

Krishna
Published on: 24 Oct 2020 4:41 PM IST
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు : చిరంజీవి
X

తెలంగాణ ప్రజలందరికీ మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. "బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇక స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

Krishna

Krishna

Next Story