Spirit Movie : సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్‎కు తండ్రిగా మెగాస్టార్.. క్లారిటీ వచ్చేసిందిగా

Spirit Movie : సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్‎కు తండ్రిగా మెగాస్టార్.. క్లారిటీ వచ్చేసిందిగా
x
Highlights

సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్‎కు తండ్రిగా మెగాస్టార్.. క్లారిటీ వచ్చేసిందిగా

Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న స్పిరిట్ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, అది కూడా సెకండాఫ్‌లో సుమారు 15 నిమిషాల పాటు ఉండే పవర్‌ఫుల్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అఫీషియల్ క్లారిటీ ఏంటో చూద్దాం.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారనే వార్తతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారని, ఆయన ప్రభాస్‌కు తండ్రిగా నటిస్తారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ ఎలాగైతే ఇంపాక్ట్ చూపించారో, అంతకంటే పవర్‌ఫుల్ రోల్‌ను చిరంజీవి కోసం సందీప్ డిజైన్ చేశారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి తను పెద్ద అభిమానిని అని, తన ఆఫీసులో కూడా చిరంజీవి పోస్టర్ ఉంటుందని చెబుతూనే.. ప్రస్తుతానికి స్పిరిట్‎లో చిరంజీవి నటించడం లేదని ఆయన ఖండించారు. "ఒకవేళ నేను చిరంజీవి గారితో సినిమా చేస్తే, అది సోలో ప్రాజెక్ట్ గానే ఉంటుంది" అని వంగా తేల్చి చెప్పారు. కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్న 15 నిమిషాల పాత్ర లేదా తండ్రి పాత్ర అనేవి కేవలం రూమర్లు మాత్రమే అని అర్థమవుతోంది.

మరోపక్క స్పిరిట్‎లో విలన్‌గా కొరియన్ నటుడు డాన్ లీ లేదా ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 2027 మార్చి 5న స్పిరిట్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఫిబ్రవరి నుంచి స్పిరిట్ తదుపరి షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో లేకపోయినా, ఆయన ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది కాబట్టి, భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories