చిరంజీవి లేదా రామ్ చరణ్ క్షమాపణలు చెప్పాలా..?

Acharya: ఈ మధ్య కాలంలో సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోలు తమ అభిమానులకు సారీ చెప్తూ...

Shireesha
Updated on: 5 May 2022 7:01 PM IST
Megastar Chiranjeevi and Ram Charan Sorry to Fans about Acharya Movie Flop | Tollywood Gossips
X

చిరంజీవి లేదా రామ్ చరణ్ క్షమాపణలు చెప్పాలా..?

Acharya: ఈ మధ్య కాలంలో సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోలు తమ అభిమానులకు సారీ చెప్తూ సోషల్ మీడియా లో పోస్ట్లు చేయటం చాలా కామన్ అయిపోయింది. తాజాగా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి రోజు నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను అందుకుంది. సినిమాకి దర్శకత్వం వహించిన కొరటాల శివ పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాలశివ కెరీర్ లో ఆచార్య సినిమా వల్ల ఒక పెద్ద డిజాస్టరే నమోదయింది. కొందరేమో చిరంజీవి మరియు రామ్ చరణ్ కథలో తల దూర్చడం వల్లే కథ చెడిపోయిందని సినిమా బాగా రాలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కొరటాల శివ దర్శకత్వం ఏ మాత్రం బాగా లేదని చెబుతున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల భారీ నష్టాలు కలిగాయి.

Shireesha

Shireesha

Next Story