Acharya Teaser: గుణపాఠాలు చెబుతున్న ఆచార్య.. టీజర్ రిలీజ్

Samba Siva Rao
Updated on: 29 Jan 2021 4:50 PM IST
Acharya Teaser: గుణపాఠాలు చెబుతున్న ఆచార్య.. టీజర్ రిలీజ్
X

 Acharya Teaser

దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు అభిమానులకు తీపికబురు చెప్పారు. ఆచార్య టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

టీజర్ విషయానికి వస్తే.. మొదట రామ్ చరణ్ వాయిస్ తో ప్రారంభం అవుతుంది. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు అంటూ రామ్ చెర్రీ ఇచ్చే వాయిస్ అద్బుతంగా ఉంది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బాహుశా గుణపాఠాలు చెబుతాననేమో అని చిరు చెప్పే డైలాగ్స్ కేక పుట్టిస్తున్నాయి.

ఇటీవలే ఈ సందర్భంగా కొరటాల డియర్ చిరంజీవి సర్.. జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటున్నాయంటూ టీజర్ అప్‌డేట్‌తో కూడిన చిన్న వీడియో షేర్ చేశారు. ఇది చూసిన చిరంజీవి.. చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు థాంక్యూ కొరటాల అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం పంచుకుంటున్నారు. రామ్ చరణ‌్ `సిద్ధ` పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story