Acharya Pre Release Business: 'ఆచార్య'కు అదిరిపోయే బిజినెస్

Acharya Pre Release Business: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా 'ఆచార్య'.

Venkata Chari
Published on: 6 April 2021 12:16 PM IST
Megastar Chiranjeevi Acharya Movie Pre Release Business Around 200 Crores
X

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ‌ (ఫొటో ట్విట్టర్)

Acharya Pre Release Business: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా 'ఆచార్య'. రాం చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చిరు గత సినిమా 'సైరా' సినిమా కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకుంది. తెలుగులో యావరేజ్ టాక్ రాగా, మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయింది. సైరా లోటును కూడా ఆచార్యతో తీర్చుకోవాలని చూస్తున్నాడు చిరు.

మరో నెల రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మే 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే, ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది. చిరు గత సినిమాల రికార్డులన్నీ బద్దలు కానున్నట్లు తెలుస్తోంది. నైజాంలో ఇప్పటికే వరంగల్ శ్రీను రూ. 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, సీడెడ్ కలిపి రూ. 60 కోట్లకు పైగానే బిజినెస్ జరుగిందని టాక్.

ఖైదీ నెం 150, సైరా సినిమాలకు ఓవర్సీస్‌లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దాంతో ఆచార్యకు కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఓవర్సీస్ రైట్స్ ను రూ. 20 కోట్లకు పైగానే మేకర్స్ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తనికి ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్ల వరకు జరుగుతుందని సమాచారం. అంటే ఈ సినిమా హిట్ కొట్టాలంటే 150 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. తెలుగులో ఇప్పటి వరకు బాహుబలి, అల వైకుంఠపురములో మాత్రమే ఈ రికార్డును అందుకున్నాయి. మరి మెగాస్టార్ ఆచార్య ఈ ఫీట్ చేస్తాడో లేదో చూడాలి మరి.

Venkata Chari

Venkata Chari

Next Story